టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలో టాప్ బౌలర్లలో ఒకడనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే భారత జట్టు తరపున కీలక బౌలర్ గా ఎదిగాడు. టాప్ బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్ ని ఎదర్కోవడానికి ఇబ్బందిపడతారు. ఫార్మాట్ ఏదైనా బుమ్రా అదరగొట్టేస్తాడు. వరల్డ్ కప్ లో తన సత్తా చూపిస్తున్న బుమ్రా.. పాకిస్థాన్ పై జరిగిన మ్యాచులో ఒక్క ఓవర్లోనే రెండు వికెట్లు తీసి తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బుమ్రా బౌలింగ్ పై ఊహించని సమాధానమిచ్చాడు.
ESPNcricinfoతో జరిగిన కార్యక్రమంలో ఫించ్ బుమ్రా బౌలింగ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. " బుమ్రా గాయపడినప్పుడు త్వరగా కోలుకోవాలని భావించాను. నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ బుమ్రా అందరిలో చాలా మెరుగా బౌలింగ్ వేస్తాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఒత్తిడిలో పడేస్తాడు. బుమ్రా బౌలింగ్ లో ఎవరైనా డిఫెన్సె ఆడడానికే ప్రయత్నిస్తారు. అటాకింగ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి" అని ఫించ్ తెలిపాడు.
ఈ సందర్భంగా బుమ్రా బౌలింగ్ ఎలా ఆడాలి అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఫించ్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. "నాలాగే రిటైర్ అవ్వండి," అని సరదాగా బదులిచ్చారు. ఫించ్ సమాధానంతో బుమ్రా బౌలింగ్ ఎదర్కోవడం ఎంత కష్టమో తెలిసిపోతుంది. కాగా ఆస్ట్రేలియా 2021 టీ 20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ఫించ్ కెప్టెన్. అంతర్జాతీయ క్రికెట్ లో బుమ్రా బౌలింగ్ లో ఫించ్ విఫలమయ్యాడు